సుడిగాలి సుధీర్ ఇంట విషాదం నింపిన కరోనా

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు బలిగొంటుంది. ప్రముఖులు పలువురు కరోనాతో మృతి చెందారు. ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యుల మృతి కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుటుంబం కరోనా కాటుకు కన్నీరు పెట్టుకుంటుంది. కుటుంబ పెద్ద అయిన సుధీర్ అమ్మమ్మ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె వయసు రీత్యా కోలుకోలేక పోయింది. ఇటీవలే ఆమె మృతి చెందింది. అమ్మమ్మ మృత దేహంను చివరి చూపుకు సుధీర్ నోచుకోలేక పోయాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోలో ఈ విషయాన్ని రామ్‌ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. సుధీర్ తన అమ్మమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడని.. అతడు తన అమ్మమ్మ చనిపోయినా చూసి రాలేని పరిస్థితి. అమ్మమ్మ చివరి చూపు కూడా దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో సుధీర్ కూడా ఎమోషనల్‌ అయ్యాడు. సుధీర్ జబర్దస్త్‌ తో పాటు ఈమద్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తున్నాడు. ఆయన ఎక్కడ సందడి చేసినా కూడా రేటింగ్‌ భారీగా వస్తూనే ఉంటుంది.