జగన్ ను తెగ పొగిడేస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తాజాగా విజయవాడ దుర్గ గుడిని సందర్శించారు. శనివారం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దుర్గమ్మ దర్శణం తర్వాత మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయవాడ దుర్గ గుడికి సీఎం జగన్‌ రూ.70 కోట్లు ఇవ్వడం నిజంగా ఆయన గొప్పతనం అన్నాడు. దేవాలయాల అభివృద్దికి తెలుగు సీఎంలు చాలా కృషి చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గారు యాదాద్రి స్వామి ఆలయాన్ని మరో తిరుపతిగా అభివృద్ది చేస్తున్నారని కొనియాడారు.

ఇక ఏపీ రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారు. బీజేపీ అక్కడ ఇక్కడ కాస్త అత్యుత్సాహంను ప్రదర్శిస్తుంది. మతతత్వ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ప్రజలు సమాధానం చెప్తారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారి మాదిరిగా వారు ఎగిరెగిరి పడుతున్నారు. రాజధాని విషయంలో జగన్‌ ప్రభుత్వం దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుందని తాను భావిస్తున్నాను. ప్రతిపక్షాల ఆందోళన విషయంలో నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. కాని చంద్రబాబు రియాల్టీ కాకుండా గ్రాఫిక్స్ ను చూపించాడంటూ ఎద్దేవ చేశాడు.