మరో క్రేజీ డైరెక్టర్ తో వైష్ణవ్‌ తేజ్ మూవీ

ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయిన వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా క్రిష్‌ దర్శకత్వంలో పూర్తి అయ్యింది. ప్రస్తుతం మూడవ సినిమా కు తమిళ అర్జున్‌ రెడ్డి దర్శకుడు గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. రెండవ సినిమా విడుదల కాకుండానే మూడవ సినిమా మొదలు పెట్టిన వైష్ణవ్ తేజ్‌ అప్పుడే నాల్గవ సినిమాకు కూడా కమిట్‌ అయ్యాడు. మైత్రి మూవీ మేర్స్‌ బ్యానర్‌ లో వైష్ణవ్‌ తేజ్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట.

వెంకీ కుడుముల ఇప్పటికే ఛలో మరియు భీష్మ సినిమాలతో సక్సెస్‌ లు దక్కించుకున్నాడు. దాంతో ఆయన దర్శకత్వంలో చేసేందుకు యంగ్‌ హీరోలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన తదుపరి సినిమాను వైష్ణవ్‌ తేజ్ తో చేసేందుకు ఓకే చెప్పడం జరిగిందట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని దసరా వరకు సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఉప్పెన సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్‌ తో కలిసి నిర్మించారు. వైష్ణవ్‌ తేజ్‌ 4వ సినిమాను కూడా సుకుమార్‌ తో కలిసి మైత్రి వారు నిర్మించబోతున్నారు.