మరో సారి కోర్టును ఆశ్రయించనున్న వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి ముందు రోజు రాత్రి ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ అదే ఫాలో అవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే భారీ మొత్తానికి కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ వెంటన్ హై కోర్టులో స్టే వేయడంతో, మొదటి మూడు రోజులు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును కలిగిగించింది. కానీ దానిపై కూడా ప్రభుత్వం రివర్స్ స్టే వేయడంతో చివరికి ప్రభుత్వమే నెగ్గింది. చాలా తక్కువ రేటుకే ఆంధ్రలో వకీల్ సాబ్ షోస్ రన్ అవుతున్నాయి.

కానీ థియేటర్స్ ఫుల్ అవుతున్నా, తక్కువ ధరల వలన మూడు రోజుల్లో రికవరీ రేటు తక్కువ కావడంతో నేడు మరోసారి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి హై కోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. దీని ద్వారా కొత్త జీవో అమలులోకి వచ్చే వరకూ పాత జీవోని అమలు చేయాలని, అలా చేసి వారికి హెల్ప్ చేయాలని కోర్టును కోరనున్నారు.

వకీల్ సాబ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో ప్రేక్షుకులు థియేటర్స్ కి బాగానే వస్తున్నారు. కానీ తక్కువ రేట్లకి టికెట్స్ అమ్ముతుండడం వలన కలెక్షన్స్ కూడా రివీల్ చేయడం లేదు.