పెళ్లి ఫోటోతో ఫ్యాన్స్ కు షాకిచ్చిన వనితా విజయ్ కుమార్

వనితా విజయ్ కుమార్ అంటేనే కేరాఫ్ కాంట్రవర్సీ అని చెప్పవచ్చు. బిగ్ బాస్ లో పాల్గొన్న వనితా అక్కడి నుండి వచ్చిన దగ్గరనుండి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఒక వారం క్రితమే మరో కాంట్రవర్సీలో భాగమైంది. విజయ్ టివిలో బిబి జోడిగళ్ షో నుండి అర్ధాంతరంగా బయటకు వచ్చేసి సీనియర్ నటి రమ్యకృష్ణ వల్లే ఇలా జరిగిందని ఆరోపించింది.

ప్రముఖ జ్యోతిష్యుడు గురూజీ వనితా వ్యక్తిగత జీవితం విషయంలో కీలక వ్యాఖ్యలు చేసాడు. వనితా మరోసారి పెళ్లి చేసుకుంటుందని, తన పేరు కూడా ఎస్ తో మొదలవుతుందని, అలాగే వనితా విజయ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తుందని, జయలలిత లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అన్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా వనితా విజయ్ కుమార్ పవర్ స్టార్ శ్రీనివాసన్ తో పెళ్లి ఫోటోను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. అయితే ఇది సినిమాలోది అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయమైతే పట్టదు.