‘ఇండియన్ 2’.. తేల్చుకునేందుకు రెడీ

సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అప్పట్లోనే ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ సాధించి కొత్త రికార్డులు నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

శంకర్ గత చిత్రం 2.0 రిలీజై ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా ఆయన నుంచి మరో సినిమా థియేటర్స్ లో రాలేదు. 2.0 తర్వాత ఆయన తెరకెక్కిస్తున్నా ‘ఇండియన్ 2’ షూటింగ్ పలు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. మొదట్లో ఈ సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేశారు. దాంతో శంకర్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ని మొదలుపెట్టారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత ‘భారతీయుడు 2’ షూటింగ్ పట్టాలెక్కించారు.