డంకీ మూవీ.. సౌత్ లో న్యూ ప్లాన్!

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కి డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని హిరాణీ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. హిరాణీ మూవీస్ అన్ని కూడా కాన్సెప్ట్ ఒరియాంటెడ్ ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ కంటే క్యారెక్టర్ ఎమోషన్స్ కి ఆయన ప్రాధాన్యత ఇస్తారు.

అందుకే హిరాణీ సినిమాలు అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. డంకీ మూవీలో షారుఖ్ ఖాన్ కి జోడీగా తాప్సి కనిపిస్తోంది. విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. షారుఖ్ పఠాన్, జవాన్ సినిమాలు హిందీతో పాటు సౌత్ భాషలలో కూడా రిలీజ్ అయ్యాయి.

కాని డంకీ మూవీని కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథ మొత్తం పంజాబీ స్టేట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కంటెంట్ కూడా అక్కడి రియల్ గా జరిగిన సంఘటనల స్ఫూర్తితో రాసుకున్నదే. అందుకే హిందీలోనే భాగా కమ్యునికేట్ చేయగలమని సౌత్ భాషలలో రిలీజ్ చేయడం లేదు. అయితే దక్షిణాది ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ మరో స్ట్రాటజీతో వస్తోంది.

దక్షిణాదిలో ఆయా భాషల సబ్ టైటిల్స్ తో మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారంట. ఈ సబ్ టైటిల్స్ కారణంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హిందీ సినిమాలలో తెలుగు రాష్ట్రాలలో నైజాంలో కొంత డిమాండ్ ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా అలాంటి ప్రయోగం చేస్తున్నారంట.

సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అయితే సౌత్ లో సలార్ వేవ్ లో డంకీ సౌత్ పెద్దగా వినపదకపోవచ్చు. రాజ్ కుమార్ హిరాణీ సినిమాలకి సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అది సిటీల వరకే పరిమితం డాన్ని ఎంత వరకు డంకీ గ్రాబ్ చేస్తుందనేది చూడాలి.