మర్కజ్ ప్రార్థనల్లో ఏం జరిగిందో తెలుసా?

గత నెలకరోనా వైరస్ ప్రమాదకర రీతిలో విస్తరిస్తున్న సమయంలో.. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో వేల మంది ఒకేసారి గుమిగూడి ప్రార్థనలు చేసిన ఫలితంగా ఇప్పుడు ఇండియా పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా రోజూ వందల మంది కరోనా బాధితులు తేలుతున్నారు.

వీరిలో దాదాపు అందరూ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొంటున్నవాళ్లు లేదంటే వాళ్లతో కాంటాక్ట్ అయిన వాళ్లు. ఐతే మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నంత మాత్రాన ఒకేసారి అంతమందికీ కరోనా రావడం ఏంటి అన్న సందేహాలు కలగొచ్చు. ఐతే ఆ ప్రార్థనల సందర్భంగా ఏం జరిగిందన్నది తెలిస్తే.. అలా వందల మంది కరోనా బారిన పడటంలో ఆశ్చర్యం లేదని అర్థమవుతుంది

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం.. ఆ రోజు మైదానంలో భోజనాలు చేసిన తీరే విస్మయాన్ని కలిగిస్తుంది. ఒక పెద్ద ప్లేటులో ఆహార పదార్థాలు పెట్టుకుని ఒకేసారి నలుగురు తినాలట. వాళ్లు ఖాళీ చేశాక ఆ ప్లేటును కడగకుండానే ఆరేడు బ్యాచ్‌లకు కంటిన్యూ చేశారట. తర్వాత ప్లేటు ఓసారి కడిగి తీసుకొస్తే.. నలుగురి చొప్పున ఆరేడు బ్యాచ్‌లు భోజనం చేశాయట.

ఇక టాయిలెట్ల పరిస్థితి అయితే మరింత ఘోరమని.. మూత్రం పోయడానికి కనీసం అరగంట క్యూలో నిలబడాలని.. టాయిలెట్ల దగ్గర మనుషుల మధ్య అసలు గ్యాప్ లేకుండా పదుల సంఖ్యలో నిలబడ్డామని.. ఇక ప్రార్థనల సమయంలో అయితే మైదానంలో ఖాళీయే లేకుండా వేలమందితో నిండిపోయిందని.. తర్వాత ట్రైన్లో ఒకరి పక్కన ఒకరం కూర్చుని ప్రయాణం చేశామని.. దీంతో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా.. మిగతా వాళ్లందరికీ సోకకుండా ఆగలేదని సదరు వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.