వన్ అండ్ ఓన్లీ వ‌న్ అత‌నే!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో నిర్మాత దిల్ రాజు స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అగ్ర నిర్మాత‌ల్లో ఆయ‌న ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నిర్మాత ఆయ‌న‌. డిస్ట్రిబ్యూట‌ర్ గా కెరీర్ ప్రారంభిం చి అంచ‌లెంచులుగా నిర్మాత‌గా ఎదిగిన వైనం ఎంతో స్పూర్తి దాయ‌కం. నిర్మాత‌గా ఆయ‌న సేఫ్ జోన్ లో ఉన్నా! ఇప్ప‌టికీ సొంతంగా డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో కొన‌సాగుతున్నారు. సినిమా న‌చ్చితే కొనేసి సొంతంగా రిలీజ్ చేస్తారు. కొన్నిసార్లు రిస్క్ సైతం ర‌స్క్ లా తీసుకుంటారు.

తాజాగా డిస్ట్రిబ్యూష‌న్ రంగాన్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ‘నిర్మాత కాక ముందు నేను పంపిణీదారుడిని. అక్క‌డ నుంచి నిర్మాత‌గా ఎదిగాను. కానీ డిస్ట్రిబ్యూష‌న్ అనేది రిస్క్ తో కూడుకున్న బిజినెస్. సినిమా ప్లాప్ అయితే చాలా స‌మ‌స్య‌లు ఫేస చేయాల్సి ఉంటుంది. కోట్ల‌లో న‌ష్టం… ఎగ్జిబిట‌ర్లు..బ‌య్య‌ర్లను అదుపు చేయాలి. సినిమా పోతే డిస్ట్రిబ్యూట‌ర్ మీద‌నే వాళ్లంతా ప‌డ‌తారు.

అందుకే డిస్ట్రిబ్యూష‌న్ అనేది లాంగ్ ర‌న్ చేయ‌డం క‌ష్టం. నేను నిర్మాత‌గా కూడా కొన‌సాగుతున్నాను. కాబ‌ట్టే రెండింటిని బ్యాలెన్స్ చేయ‌గ‌ల్గుతున్నా. ఒక సినిమా పోయినా మ‌రో సినిమా ద్వారా ఆ న‌ష్టాల్ని భ‌ర్తీ చేస్తూ పంపిణీ రంగంలో కొన‌సాగుతున్నా. ఒక సినిమాకి 10 కోట్లు పోతే..మ‌రో సినిమాకి 25 కోట్లు పోతాయి. ఆ న‌ష్టాలు మ‌రో సినిమా ద్వారా భ‌ర్తీ అవుతుంటారు. ఏడాది మొత్తం నా సొంత సినిమాలు..పంపిణీ చేసిన సినిమాలు టాలీవేసి చూస్తా.

అందులో ఒక్క‌సారి న‌ష్టాలుంటాయి.. లాభాలుంటాయి. నిర్మాత‌గా స‌క్సెస్ ఫుల్ గా ఉన్న‌ను కాబ‌ట్టి డిస్ట్రిబ్యూష‌న్ కొన‌సాగిస్తున్నా. ఇది డేరింగ్ బిజినెస్. నేను…శిరీష్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాం కాబ‌ట్టి పంపిణీ రంగంలో ఉన్నాం. సురేష్ బాబు గారు..అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గానే ఎక్కువ‌గా సినిమాలు చేస్తారు. డిస్ట్రిబ్యూష‌న్ పెద్ద‌గా చేయ‌రు. ఎందుకంటే వాళ్ల‌కు తెలుసు డిస్ట్రిబ్యూష‌న్ అనేది ఎలా ఉంటుందో. వాళ్ల‌కు ఎంతో అనుభ‌వం ఉంది. అందుకే వాళ్లు సేఫ్ జోన్ లో ఉండేలా చూసుకుంటారు. నేను అలా ఉండ‌ను. రిస్క్ తీసుకుని సినిమాలు చేస్తుంటా’ అని అన్నారు. మొత్తానికి టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ రాజు గారు డేరింగ్ ని మెచ్చుకోవాల్సిందే.