అనసూయ డౌటాను‘మా’నం.. ఎందు‘వల’నచేత.!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అసలు సిసలు ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయ్. మంచు విష్ణు గెలవడం, ప్రకాష్ రాజ్ ఓడిపోవడం.. ఇక్కడి వరకూ మార్పుల్లేవ్. కానీ, తొలుత అత్యద్భుతమైన మెజార్టీతో గెలిచిన అనసూయ, ఎలా చివరి ఫలితాల్లో ఓడిపోయిందబ్బా.?

ఈ డౌటానుమానం అనసూయకే వచ్చింది. బ్యాలెట్ పత్రాల్ని రాత్రికి రాత్రి ఎవరో ఇంటికి తీసుకెళ్ళారట.? అని సోషల్ మీడియాలో ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నట్లు అనసూయ ‘అనుమానం’ వ్యక్తం చేసింది. ఇది నిజమేనంటారా.? అంటూ అనసూయ తనదైన స్టయిల్లో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది.

‘మా’ ఎన్నికల విషయమై మొదటి నుంచీ చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడూ సినిమా వ్యవహారాలకు సంబంధించి హైద్రాబాద్ మొహం చూడని జెనీలియా, ఓటేయడానికి ఎలా వచ్చిందబ్బా.? ‘మా’ ఎన్నికల మీద ఆమెకు అంత ఆసక్తి ఏంటబ్బా.? అని.

ఇక, కొందరి ఓట్లను ముందుగానే ‘ఓ వర్గం’ కొనుగోలు చేసేసిందన్న ఆరోపణలున్నాయి. పది వేల రూపాయల నుంచి 75 వేలు, ఆ పైన.. కూడా ఖర్చు చేసి మరీ ‘మా’ ఎన్నికల్లో గెలుపు కోసం కొందరు ‘ప్రతిష్టాత్మక రాజకీయం’ చేశారనే ఆరోపణలూ లేకపోలేదు. రిగ్గింగ్ ఆరోపణల సంగతి సరే సరి.

నిజానికి, ‘మా’ ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యాక, మొదటగా గెలిచినవారికి సంబంధించి వచ్చిన పేర్లలో అనసూయ ముందు వరుసలో నిలిచింది. ఆమె బంపర్ విక్టరీ (ఈసీ మెంబర్) సాధించినట్లు వార్తలొచ్చాయి. మరి, అలాంటి అనసూయ ఎలా ఓడిపోయింది.? అనసూయ, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఏదో తేడా ఏంటి.? అన్నీ తేడాలే. లేకపోతే, ఈ ఫలితాలేంటి.? ఈ కథేంటి.? కులం, మతం, ప్రాంతం.. ఇలా దేన్నీ వదలకుండా రాజకీయం చేశారు.. అదీ మొత్తంగా పోలైన ఆరు వందల యాభై ఓట్ల కోసం. ఇంత నిస్సిగ్గు రాజకీయం.. నభూతో నభవిష్యతి.

ఇంతకీ, అనసూయ డౌటానుమానాలకు నివృత్తి ఎలా.? చిన్న సమస్య కాదిది.. చాలా పెద్ద సమస్య. ‘మా’ ప్రతిష్ట మసకబారిపోయేంత సమస్య. ‘అత్యధిక మెజార్టీ’ అనసూయకే.. అన్న మాట, ఏదన్నా ‘చల్లని’ హృదయాన్ని గట్టిగా బద్దలుగొట్టేసిందా.? అందుకే, ఆమె గెలుపు ఫలితాన్ని ఓటమి ఫలి