అనుపమ పరమేశ్వరన్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..! ఎందుకంటే..

తమ హీరోను ఫ్యాన్స్ గౌరవిస్తారు.. ఎదుటివారు కూడా అలానే చూడాలని భావిస్తారు. లేదంటే వారికి కోపం వచ్చేస్తుంది. పవన్ కల్యాణ్ విషయంలో అలా చేస్తే చెప్పేదేముంది. కానీ.. అలాంటి ట్వీట్ చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై ప్రస్తుతం ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటివల వకీల్ సాబ్ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసి అనుపమ తన అభిప్రాయాన్ని చెప్తూ ట్వీట్ చేసింది.

అయితే.. ట్వీట్ లో ప్రకాశ్ రాజ్ ను ‘సర్’ అంటూ.. పవన్ కల్యాణ్ ను మాత్రం పేరుతోనే పలికింది. దీంతో ఫ్యాన్స్ కు విపరీతమైన కోపం వచ్చేసింది. దీంతో అనుపమకు వ్యతిరేకంగా మెసేజులు, ట్వీట్లు, ట్రోలింగ్ లు జరిగిపోయాయి. ఆ ఉధృతిని గమనించిందేమో.. వెంటనే అలెర్ట్ అయింది అనుపమ. వెంటనే మరో ట్వీట్ చేస్తూ.. ‘పవన్ సర్’ అని పేర్కొంది. పవన్ గారిపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందని పేర్కొనటంతో ఫ్యాన్స్ కొద్దిగా శాంతించారు.