పవన్ ఎందుకిలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు – అర్చన

తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు రావు అన్న నానుడి అర్చన విషయంలో మరోసారి నిజమైంది. అందానికి అందం, అభినయించగల సామర్ధ్యం ఆమె సొంతమైనా కూడా అర్చన ఇండస్ట్రీలో అంతలా నిలదొక్కుకోలేక పోయింది. హీరోయిన్ గానే ఆమె కెరీర్ ను మొదలుపెట్టినా కానీ చాలా త్వరగానే ఆమె హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు, ఐటమ్ నంబర్స్ కు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది.

2019లో ఆమె పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోయింది కూడా. అయితే అర్చన ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టమని, ఖుషి సినిమా చూసి అందరు అమ్మాయిలలానే తను కూడా పవన్ కు అభిమానిగా మారినట్లు ఆమె తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ అప్పట్లో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసేవారు. అది నాకు అస్సలు నచ్చేది కాదు. అయ్యో ఆయన ఎందుకిలా చేస్తున్నారు అని బాధపడేదాన్ని. అయితే ఆ పిచ్చి ప్రయోగాలు ఏంటో రివీల్ చేయడానికి మాత్రం ఆమె ఇష్టపడకపోవడం కొసమెరుపు.