సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి నాకు తెలీదు! పూరి కష్టంలో ఉంటే కలవకూడదా?

సినీఇండస్ట్రీలో నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ ప్రస్థానం గురించి తెలిసిందే. ఆయన సినీరంగంలో కొనసాగుతూనే రాజకీయాలపైనా కన్నేశారు. కానీ అక్కడ అతడికి గెలుపు సాధ్యపడలేదు. ఇకపోతే ఇప్పుడు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వేళ మళ్లీ బండ్ల హవా కనిపిస్తోంది. అతడు తొలి నుంచి ప్రకాష్ రాజ్ అధ్యక్షుడు కావాలని ఆకాంక్షిస్తూ ప్రచారంలో ముందుగా ఉన్నాడు. కానీ చివరి నిమిషంలో ఏమైందో ప్రకాష్ రాజ్ తాను ప్రకటించిన ప్యానెల్ సభ్యుల జాబితాలో అసలు బండ్ల పేరే కనిపించలేదు. తన స్థానంలో జీవిత రాజశేఖర్ పేరు కనిపిండంతో దీంతో తీవ్రంగా హర్టయ్యారు.

ఇకపోతే `మా` ఎన్నికల్లో సిత్రాలపై బండ్ల గణేష్ ప్రముఖ వార్తా చానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు ముచ్చటించారు. తాను ప్రకాష్ రాజ్ ప్యానెల్లో మొదటి నుంచి ఉన్నానని జీవిత రాజశేఖర్ రాకను ఊహించలేదని అన్నారు. జీవిత ఈ ప్యానెల్ నుంచి పోటీ చేస్తే తాను ఆ ప్యానెల్ లో ఉండనని స్పష్ఠంగా చెప్పారు. అలాగే జీవిత రాజశేఖర్ రాజీ పడి ఈ ప్యానెల్ లో పని చేస్తారని తాను అనుకోవడం లేదని కూడా అన్నారు. జీవితపై పోటీపడి జనరల్ సెక్రటరీగా గెలుస్తానని అన్నారు. నేను గెలుస్తున్నా అని చెబుతున్నా. ఆవిడ ఓడిపోతారని చెప్పడం లేదు అంటూ బండ్ల ఛమత్కరించారు.

అలాగే డ్రగ్స్ స్కాండల్ విచారణ జరుగుతుంటే పూరీని కలిసారెందుకని? అంటూ ప్రశ్నించగా… పూరి నా స్నేహితుడు కష్టంలో ఉంటే కలవడం తప్పా? అని ప్రశ్నించారు. పూరి తప్పు చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు.. 30ఏళ్ల స్నేహితుడు పూరి అని తెలిపారు. చిరంజీవి గారిని హైదరాబాద్ చూడటానికి వచ్చాను.. పూరి వల్ల కలిసాను కాబట్టే ఆయనంటే అభిమానం అని అన్నారు. నేను నటరంగంలో లాగా నిజజీవితంలో రంగులు మార్చను.. ఒకరినే అభిమానిస్తాను స్నేహం చేస్తాను అని అన్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన దేవుడు అని మరోసారి బండ్ల అన్నారు. డ్రగ్స్ డీలర్ కెల్విన్ ఎవరో తెలీదని కూడా అన్నారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి నాకు తెలీదు అని బండ్ల గణేష్ అన్నారు.

ప్రకాష్ రాజ్ కి ఊహించని షాకిచ్చిన బండ్ల

`మా` ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున నిర్మాత బండ్ల గణేష్ పోటీ చేస్తారని భావిస్తే ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసినదే. అయితే విలక్షణ నటుడుకి షాకిస్తూ బండ్ల గణేష్ ఓ ట్వీట్ వదిలారు. ప్రకాష్ రాజ్ గారు మీ ఫ్యానల్ లో స్పోక్స్ పర్సన్ గా అవకాశం ఇచ్చినందకు కృతజ్ఞతలు. కానీ నా వ్యక్తిగత కారణాలుగా పోటీ చేయలేను. ఆ పోస్టుకు వేరే వాళ్లను తీసుకోండి. మీ టీమ్ కి అల్ ది బెస్ట్ అంటూ షాకిచ్చారు. ఆ తర్వాత వెంటనే తన స్టాండ్ ఏంటో కూడా చెప్పేసారు. స్వతంత్రుడిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

`మాట తప్పను..మడమ తిప్పను..నాది ఒకటే మాట..ఒకటే బాట. నమ్మిన వారి కోసం బతుకుతా. నా మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకుంటాను. నేను ఎవరి మాట వినను` అంటూ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. బండ్ల ఉన్నట్లుండి ఇలా షాకివ్వడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఖంగుతింది. పార్టీ మారినంత ఈజీగా ప్రకటన ఇచ్చేసాడంటూ ట్విటర్లో బండ్ల తీరుపై నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ముందుగా ప్రకాష్ రాజ్ – బండ్ల అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతే కదా ప్యానల్ ప్రకటించారు. తనకేమైనా అభ్యంతరాలుంటే అప్పుడే చెప్పాలి గాని సడెన్ గా ఇలా తప్పుకుంటే ఎలా? ఏదైనా విషయం ఉంటే నేరుగా ప్రకాష్ రాజ్ కి ఫోన్ చేసి చెప్పాలిగాని ఇలా ట్విటర్లో తెలపడం ఏంటి? అని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

దీంతో బడ్ల వైఖరిపై ప్రకాష్ రాజ్ టీమ్ తీవ్ర అసహనంతో రగిలిపోతున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసు విషయంలో ఈడీ టాలీవుడ్ ప్రముఖుల్ని విచారిస్తోన్న సంగతి తెలిసిందే. తొలి రోజు పూరి జగన్నాథ్ ని కొన్ని గంటల పాటు విచారించారు. ఆ సమయంలో ఈడీ నుంచి బడ్ల గణేష్ పిలుపు వెళ్లడంతో హుటా హుటిన హాజరయ్యారు. ఆది జరిగిన నాలుగైదు రోజుల్లోనే బండ్ల గణేష్ `మా` పోటీ నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారిందన్న ప్రచారం సాగుతోంది.