‘భీమ్లానాయక్’పై ‘బులుగు – పచ్చ’ దాడి షురూ.!

ఏ వివాదాన్ని సృష్టించి ‘భీమ్లానాయక్’ సినిమాని దెబ్బతీయాలన్నదానిపై అటు బులుగు, ఇటు పచ్చ రాజకీయం ఒక్క చోట కూర్చుని మేధోమధనం చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి వుండగా, అత్యంత వ్యూహాత్మకంగా కొన్ని ‘శక్తులు’ ఆ సినిమా విడుదలను వాయిదా వేయించగలిగాయి.

సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడితో, ఓ బులుగు పార్టీ అలాగే ఓ పచ్చ పార్టీ నడిపిన రాజకీయమే ‘భీమ్లానాయక్’ వాయిదా పడటానికి కారణమంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కరోనా వైరస్ కంటే దారుణమైన రాజకీయమిది. సరే, గతం గతః ఇప్పుడేం జరగబోతోంది.? ఫిబ్రవరి 25న సినిమా విడుదల కానుండగా, ఈ ప్రకటన వెనుక అల్లు అరవింద్‌ని దెబ్బ తీసే కుట్ర, మెగా కాంపౌండ్‌లో పెరిగిన విభేదాల కారణంగానే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమాపై పోటీకి దిగిన పవన్ కళ్యాణ్.. అంటూ ‘బులుగు పచ్చ కథనాలు’ తెరపైకొచ్చాయి.

వామ్మో, మరీ ఇంత ద్వేషమా.? అనడక్కండి.. అంతకు మించి.! సినిమాలో ఏదన్నా పాట, ఏదన్నా డైలాగ్.. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినాసరే, దాన్ని కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో వివాదాస్పదం చేయడానికి ‘గోతికాడి నక్కల్లా’ బూలుగు పచ్చ కార్మికులు తెరవెనుకాల కష్టపడుతున్నారట.

ఇవన్నీ ఓ యెత్తు.. ‘భీమ్లానాయక్’ సినిమాని బ్యాన్ చెసెయ్యాలంటూ అప్పుడే సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ మేరకు ‘బ్యాన్ భీమ్లానాయక్’ అంటూ హ్యాష్‌ట్యాగులూ షురూ అయ్యాయి.

మరోపక్క, ‘పుష్ప’ సినిమాతో పోల్చుతూ.. ‘భీమ్లానాయక్’పై ఓ వివాదాల ఫిలిం మేకర్ సోషల్ మీడియా వేదికగా విషం చిమ్మడం మొదలు పెట్టాడు. తద్వారా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవ పెట్టాలన్నది ఆ వికారపు జీవి ప్రయత్నం.

ఇవన్నీ ఓ యెత్తు అయితే, ఫిబ్రవరి 25న ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల కావడంలేదనీ, ఏప్రిల్ 1కి వాయిదా పడబోతోందంటూ తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించేందుకు అటు బులుగు పార్టీ, ఇటు పచ్చ పార్టీ తమ ట్రేడ్ మార్క్ కుట్రల రాజకీయాలతో సిద్ధంగా వున్నాయి.

ఇంత వ్యతిరేకత నడుమ ‘భీమ్లానాయక్’ సినిమా ఏమవుతుంది.? అంటే, నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలకి ఈ తరహా దుష్ప్రచారం కొత్తేమీ కాదు. ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో ఇంకాస్త ఎక్కువగా దుష్ప్రచారం జరుగుతోందంతే.!