భీమ్లాకి నైజాంలో భలే కలిసి వచ్చింది

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా హిట్ టాక్ ను దక్కించుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. వంద కోట్లకు పైగా ఇప్పటికే వసూళ్లు రాబటిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది. ఆదివారం వరకు సినిమా జోరు కొనసాగి ఆతర్వాత సైలెంట్ అయ్యే అవకాశం ఉందని కొందరు భావించారు. కాని సోమవారం కూడా సినిమాకు భారీ గా వసూళ్లు నమోదు అయ్యాయి.

నైజాం ఏరియాలో ఈ సినిమా నాల్గవ రోజు అయిన సోమవారం కూడా ఏకంగా 2 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి. విడుదలైన నాల్గవ రోజు అది కూడా వీక్ డే లో అంతగా షేర్ నైజాం ఏరియాలో రావడం అంటే చాలా పెద్ద విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అయిదవ రోజు కూడా సినిమా మరింత భారీ వసూళ్లు నమోదు చేయబోతుంది.

భీమ్లా నాయక్ కు మహా శివరాత్రి సెలవు రోజు కలిసి రాబోతుంది. సినిమా కు భారీగా వసూళ్లు నమోదు అవ్వబోతున్నట్లుగా ముందు నుండే టాక్ వినిపించింది. ఊహించినట్లుగానే శివరాత్రి సందర్బంగా నైజాం ఏరియాలో 85 నుండి 100 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మొదటి రోజు రేంజ్ లోనే అయిదవ రోజు కూడా ఈ సినిమా వసూళ్లను దక్కించుకుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివ రాత్రి సందర్బంగా సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు. దాంతో మల్టీ ప్లెక్స్ ల్లో అదనపు షో లు మరియు స్క్రీన్స్ కూడా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 27.5 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లుగా ట్రేడ్ వర్గాల టాక్.

భీమ్లా నాయక్ జోరు చూస్తుంటే కేవలం నైజాం ఏరియాలోనే హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం ఉందనిపిస్తుంది. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఈ స్థాయిలో అక్కడ వసూళ్లు నమోదు చేయలేక పోతున్న భీమ్లా నాయక్ ఓవర్సీస్ లో మాత్రం భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి. భీమ్లా నాయక్ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత ఏపీ లో అభిమానులు నానా రచ్చ చేశారు. అయినా కూడా అక్కడ టికెట్ల రేట్ల విషయంలో అధికారులు చాలా కఠినంగా వ్యవహరించారు.