చైల్డ్ ఆర్టిస్ట్ ను అడాప్ట్ చేసుకున్న బిగ్ బాస్ సిరి

బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి హన్మంత్ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అటు టాస్క్ లలో కానీ ఇటు తన బిహేవియర్ లో కానీ సిరి అందరినీ అట్ట్రాక్ట్ చేస్తోంది. నెమ్మదిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటోన్న సిరి హన్మంత్ ఇప్పుడు తల్లి అయిందని తెలుస్తోంది.

బిగ్ బాస్ కు రాక ముందే తన సహనటుడు శ్రీహాన్ తో సిరికు ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లికి ముహుర్తాలు చూస్తుండగా బిగ్ బాస్ ఆఫర్ తలుపుతట్టింది. ఇక తల్లి అవ్వడం ఏంటంటే, శ్రీహాన్, సిరి కలిసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ను దత్తత తీసుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని దత్తత తీసుకున్నారా అని ప్రశ్నించగా సిరి అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఎస్ అనే సమాధానం వచ్చింది. ఇక బిగ్ బాస్ లో ప్రస్తుతం నామినేషన్స్ లో ఉంది సిరి హన్మంత్. మరి ఈ వారం ఆమె సేవ్ అవుతుందో లేదో చూడాలి.