జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఇప్పుడే నష్టం ఎక్కువ: చంద్రబాబు

ఇటివల జరిగిన క్యాబినెట్ విస్తరణతోనే జగన్ ఎంత బలహీన సీఎం అనేది అర్ధమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ చేసిన వారికే పదవులు కట్టబెట్టు వైసీపీలోనే చెప్పుకుంటున్నారని అన్నారు. దీంతో ఆ పార్టీలోని డొల్లతనం, అసంతృప్తి బయటపడినట్టైందని అన్నారు.

జగన్ తీరుతో రాష్ట్ర విభజన సమయం కంటే ఇప్పుడే నష్టం ఎక్కువ జరుగుతోందని మండిపడ్డారు. తన నిర్ణయాలతో ఏపీ కూడా రివర్స్ లో వెళ్తోందని అన్నారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది కూడా అందుకేనని ఆరోపించారు. జగన్ తీరుతో సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.

వాలంటీర్లను పెట్టిందే ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చేందుకని చెప్పిన జగన్ ఇప్పుడు వారం పూర్తైనా ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉందని చంద్రబాబు అన్నారు. ఈనెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని అన్నారు.