చిరంజీవి సినిమాకు మరిన్ని మార్పులు జరుగుతున్నాయా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత చిరంజీవి వరస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో మొదటిది మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫెర్ రీమేక్.

మొదటగా సుజీత్ ను ఈ చిత్రానికి దర్శకుడిగా అనుకున్నారు. ఆ తర్వాత వివి వినాయక్ వచ్చాడు. కానీ చివరికి మోహన్ రాజాను దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో లూసిఫెర్ రీమేక్ పనులు మొదలయ్యాయి.

తెలుగు నేటివిటీ, మెగాస్టార్ ఇమేజ్ కు అనుగుణంగా మోహన్ రాజా ఈ కథకు మార్పులు చేసుకుంటూ వచ్చారు. అసలైతే జూన్ నుండి లూసిఫెర్ రీమేక్ షూటింగ్ మొదలవ్వాలి కానీ ఆలస్యమవుతోంది. దీంతో మోహన్ రాజా స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు తీసుకొస్తున్నాడట.