నవ్వించే గెటప్ శీను గొంతు కోసుకుని ఏడిపించాడు

ఈటీవీలో ప్రతి పండుగ సందర్బంగా ఈవెంట్ లు నిర్వహించడం సర్వ సాదారణంగా కనిపిస్తూ వస్తుంది. సంక్రాంతి సందర్బంగా అత్తో అత్తమ్మ కూతురో ఈవెంట్‌ నిర్వహించారు. జబర్దస్త్‌ కమెడియన్స్‌ మరియు సోషల్‌ మీడియాలో తరచు కనిపించే వారు ఈ షో లో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. రెండవ ప్రోమో కొన్ని గంటల క్రితం యూట్యూబ్‌ లో విడుదల చేశారు. ఈ ప్రోమో అంతా కూడా సరదాగా సాగింది. కాని చివర్లో గెటప్ శ్రీను వేసిన స్కిట్‌ తో అందరు కన్నీరు పెట్టుకున్నారు.

గెటప్ శ్రీను రైతు పాత్రలో కనిపించాడు. రైతులు అనే వాడు ప్రతి సారి నష్టం వస్తు ఉన్నా కూడా అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. రైతుల గురించి అందరికి తెలిసేలా గెటప్ శ్రీను ఈ స్కిట్‌ లో అద్బుతంగా నటించాడు.

చివర్లో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆత్మార్మణం తప్ప మరేం లేదు అంటూ పంట కోసం కొడవలితో గొంతు కోసుకున్నాడు. రైతుల సమస్యలపై గెటప్ శీను చేసిన స్కిట్ కు మంచి మార్కులు పడ్డాయి. రష్మి.. అనసూయ.. రోజా అంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు.