హిందూ మతంపై ఐపీఎస్ అధికారి వ్యతిరేక వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఆగ్రహం

పెద్దపల్లిలో హిందూ దేవుళ్లను పూజించొద్దు, నమ్మొద్దని ప్రభుత్వ గురుకులాల (స్వేరోస్) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయడంపై బీజేపీ, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ అధికారులే హిందు మతానికి వ్యతిరేకంగా సంస్థలు నడుపుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు. రాముడు, కృష్ణుడును నమ్మబోమని, పెద్దలకు పిండ ప్రదానాలు చేయమని కొందరు ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో కలిసి ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయడం వివాదం రేపింది.

ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై పలు జిల్లాల్లో ఆయన దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుమార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఆరోపణలు ఉన్నా గురుకుల విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ఆయన్ను ఎందుకు కొనసాగిస్తుందో ప్రభుత్వం చెప్పాలని వీహెచ్ పీ అధికార ప్రతినిధి శశిధర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పరిగిలోని హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.