నందమూరి ‘విక్రమ్’.. ఫ్యాన్స్ కోరిక తీరేనా?

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ లు కీలక పాత్రలో నటిస్తున్న సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల అయ్యింది. ఆ పోస్టర్ లో ముగ్గురు స్టార్స్ ఫేస్ లను చూపించారు. పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ముగ్గురు దిగ్గజ నటీనటులు పోటీ పడి మరీ నటించడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్నారు. ఆ పోస్టర్ ను కొందరు నెటిజన్స్ ఇష్టానుసారంగా మార్పింగ్ చేశారు.

ఆమద్య ఎన్టీఆర్.. రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ వచ్చిన సమయంలో కొన్ని వేల మార్ఫింగ్ పోస్టర్ లు వచ్చాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇప్పుడు విక్రమ్ పోస్టర్ ను నందమూరి అభిమాని ఒకరు మార్ఫింగ్ చేసి ఇలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నందమూరి అభిమానుల అందరి కోరిక ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకే పోస్టర్ లో ఇలా ముగ్గురు నందమూరి హీరోలు బాలకృష్ణ.. ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లను ఎప్పటికి చూస్తామో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ముగ్గురు హీరోల్లో కనీసం ఇద్దరు హీరోలు అయినా కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్న ఈ విక్రమ్ తరహా పోస్టర్ అంటే ముగ్గురు హీరోలు కలిసి నటించడం సాధ్యమేనా అంటే చాలా కష్టం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అయితే ముగ్గురు కాకున్నా ఇద్దరు మాత్రం ఏదో ఒక సమయంలో కలిసి వెండి తెరపై కనిపిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. బాలయ్య.. కళ్యాణ్ రామ్ లేదా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు కలిసి నటిస్తారు. బాలయ్య.. ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే అది ఖచ్చితంగా అద్బుతం అవుతుందని అంటున్నారు. ఈ మూడు లో ఏది కన్ఫర్మ్ అయినా కూడా ఖచ్చితంగా అభిమానులకు పండుగే.