మరో భారీ బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసిన మహేష్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్ గా నటించింది కియారా అద్వానీ. ఇదే ఆమెకు తెలుగులో మొదటి సినిమా. అప్పటికి ఇంకా ఈ అమ్మడు బాలీవుడ్ లో బిజీ అవ్వలేదు. తెలుగులో మొదటి చిత్రంతోనే మంచి ఇంప్రెషన్ ను క్రియేట్ చేయగలిగింది.

కట్ చేస్తే ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీలో ఉంది. వరసగా హిందీ ప్రాజెక్టుల్లో నటిస్తూ టాప్ రేంజ్ కు చాలా త్వరగా చేరుకుంటోంది. ప్రస్తుతం కియారా నటిస్తోన్న నాలుగైదు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. రీసెంట్ గా నటించిన లక్ష్మి సినిమా ద్వారా మరోసారి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు మరో భారీ బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజ్ లలో క్రిష్ కూడా ఒకటి. ఇప్పటికే క్రిష్ ఫ్రాంచైజ్ లో మూడు సినిమాలు రాగా ఆ మూడూ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ప్రస్తుతం నాలుగో సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాకేష్ రోషన్ ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించాల్సి ఉండగా ఒక హీరోయిన్ గా కియారా పేరు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది.