పెళ్లి అయినా సినిమాలోనే ఉంటా

తన అభిమానులకు షాక్‌ ఇస్తూ ఈనెలలోనే తన పెళ్లి అంటూ ప్రకటించిన టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా నటిస్తానంటూ అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని కూడా పెళ్లి తర్వాత విడుదల అవ్వబోతున్నావే. ఆ సినిమాలు సక్సెస్‌ అయితే ఖచ్చితంగా కాజల్‌ అగర్వాల్‌ కు మరిన్ని ఆఫర్లు వస్తాయంటూ అంతా భావిస్తున్నారు.

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఈమె ఆచార్య సినిమాలో నటిస్తుండగా కోలీవుడ్‌ లో ఇండియన్‌ 2 సినిమాను చేస్తోంది. ఈ రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ అయితే మరో రెండు మూడు సంవత్సరాల పాటు ఈమె కెరీర్‌ బిజీ బిజీగా సాగే అవకాశం ఉందని అంతా భావించారు. కాని పెళ్లి తర్వాత ఎంత వరకు ఆఫర్లు వస్తాయి అనేది చూడాలి.

పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ కాజల్‌ నమ్మకంగా చెబుతుంది కనుక ఆమె ఖచ్చితంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఆమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేయలేదు.

పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్‌ మూవీని ఈమె పెళ్లి తర్వాత చేసే అవకాశం ఉందనిపిస్తుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమాతో పాటు తెలుగులో ఈమె మరో చిన్న సినిమాలో కూడా నటిస్తుంది. ఆ సినిమా విషయమై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ లు అయినా ఈమెకు ఛాన్స్‌ లు తెచి పెట్టే అవకాశం ఉంది. కనుక పెళ్లి తర్వాత కూడా ఈమె ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లికి ముందు చేసేనట్లుగానే ఈమె పెళ్లి తర్వాత కూడా ఎక్స్‌ పోజింగ్‌ చేస్తుందా లేదా అనేది చూడాలి.

ఇక ఈమె పెళ్లి చేసుకోబోతున్న గౌతమ్‌ కిచ్లు సినిమాల విషయంలో ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానంటూ హామీ ఇచ్చాడట. ఆమె ఇష్టానుసారంగా నటించేందుకు ఓకే చెప్పాడట. ఎంత ఓకే చెప్పినా ఒక బాబు లేదా పాప అయిన తర్వాత కాజల్‌ మళ్లీ కనిపిస్తుందా అంటే అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share