Karthika Deepam Serial November 30th Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 665 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 666 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (నవంబర్ 30) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్ సీట్ దగ్గరకు వెళ్లిన సౌర్య.. తన తండ్రి కూర్చునే కుర్చీని ప్రేమగా తాకుతూ.. ఆ పరిసరాలను గమనిస్తూ.. కుర్చీలో కూర్చుని సంబరపడిపోతుంది. తర్వాత కార్తీక్ కార్డియాలజిస్ట్.. నేమ్ బోర్డ్ తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకుని.. చూసుకుంటుంది. వెంటనే ఒక కాగితం తీసుకుని.. దానిలో దాన్ని చుట్టి ఎవరూ చూడకుండా పట్టుకెళ్లి ఆటోలో దాచుకుంటుంది. ఆ సీన్ మొత్తం బ్యాగ్ రౌండ్ పాట రావడం, సౌర్య నటన.. ప్రేక్షకుల గుండెను కలిచివేస్తుంది.

రెచ్చగొట్టిన మౌనిత

కార్తీక్ హాస్పటల్‌లో కూర్చిని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురుగా మౌనిత కూర్చుని ఉంటుంది. ‘నాకు ఏం అర్థం కావట్లేదు. దీపని ఎంత దూరం చేద్దామనుకున్నా దగ్గర అవుతూనే ఉంది. పైగా ఇప్పుడు సౌర్య కూడా దగ్గరవుతోంది’ అంటూ తన బాధని మౌనితతో చెప్పుకుంటాడు. అది విని కూడా కావాలనే.. ‘ఈ రోజు సర్జరీలు ఎన్ని ఉన్నాయి కార్తీక్’ అంటూ సంబంధం లేని విషయాన్ని మాట్లాడి రెచ్చగొడుతుంది. నువ్వు చెప్పే పనికిమాలిన విషయం కంటే నేను చెప్పేది ఏమంత పనికి రాని విషయం కాదంటూ పుల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది.

కార్తీక్ మనసు కలుషితం

గతంలో దీప కొబ్బరి కాయతో దొంగను కొట్టిన రోజు సీన్ గుర్తు చేస్తూ.. ‘ముద్దుగా మురిపంగా దాన్ని మొట్టికాయలు వేస్తూ..’ దాని కూతురికి స్కూల్ ఫీజ్, టూర్ ఫీజ్ కట్టి.. మీ అమ్మా నాన్నల మాట విని, రేపు కోర్టుకు పిలిస్తే అక్కడికి వెళ్లి.. ‘నా భార్య మహాపతివ్రత అని చెప్పుకుని, ఇంటికి తెచ్చుకుని కాపురం చేసుకో’ అంటూ బాగా రెచ్చగొడుతుంది సౌర్య.

రగిలిపోయిన కార్తీక్

మౌనిత మాటలు ఆావేశంతో ఊగిపోయిన కార్తీక్.. మౌనిత మీద అరుస్తాడు. ‘నీకు ఇష్టంలేకపోతే రావడం మానెయ్. నా బాధ వినడం మానెయ్. అంతే కానీ.. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు’ అంటూ రగిలిపోతాడు. అయితే మౌనిత మాత్రం ఇదే కరెక్ట్ టైమ్ అనుకుంటూ.. బాగా రెచ్చగొడుతుంది. ‘మొన్న ఆసుపత్రికి తీసుకొచ్చి.. ఒక టెంకాయ రెండు చిప్పలు కాన్సెస్ట్‌తో అందరికీ దీపే నీ పెళ్లాం అని తెలిసేలా చేశావు.. రేపు కోర్టుకి వెళ్లికూడా ఒప్పుకుని దాన్ని(దీపని) తెచ్చుకో’ అంటూ అరిచి వెళ్లిపోతుంది.

దీపని దూరం చేస్తా!

కార్తీక్‌కి బాగా ఎక్కించిన మౌనిత.. బయటికి వచ్చిన తర్వాత విలన్‌లా నవ్వుకుంటూ.. ‘ఈ దెబ్బతో కార్తీక్‌లో కోర్టు భయం మొదలు కావాలి. ఇంతలో నేను దీపని ఎలా దూరంగా పంపాలా అని ఆలోచిస్తాను’ అనుకుంటుంది. కార్తీక్ తన రూమ్‌లో ఆలోచించుకుంటూ ఉంటాడు.

షాక్ న్యూస్ చెప్పిన సరోజా

‘దీపా సౌర్య స్కూల్‌కి వెళ్లిపోయిందా? నీకో విషయం చెప్పాలి దీపా.. అది వెళ్లాక వద్దామని ఆగాను’ అంటుంది సరోజ. ‘లేదక్కా వెళ్లిపోయింది’ అని చెప్పడంతో సరోజ టెన్షన్ పడుతూ.. ‘దీపా ఇందాక హాస్పెటల్‌లో డాక్టర్ బాబు నీతో ఏం అన్నాడు? మీరు మాట్లాడుకుంటుంటే సౌర్య తలుపు చాటుగా చూస్తూ మీ మాటలు వింటుంది. ఇంతలో నర్స్ రావడంతో పక్కకు తప్పుకుంది’ అని చెబుతుంది.

సౌర్య గురించి దీప టెన్షన్

‘అవునా సరోజక్కా.. ఇంతాక కూడా ఏదో తేడా మాట్లాడింది అక్కా..! ఇక్కడ అంతా అబద్దాలు చెబుతారు.. అంటూ వెళ్లిపోయింది. అయినా ఈ మధ్య అంతా వింతగా ప్రవర్తిస్తోంది అక్కా.. ఏం మాట్లాడుతుందో తన తండ్రి గురించి ఏం తెలుసుకుందోనని చాలా భయంగా ఉంది అక్కా’ అంటూ అనుమానంగా, బాధగా అంటుంది దీప.

ధైర్యం చెప్పిన సరోజా

‘ఏం కాదులే దీపా.. దానికి(సౌర్యకి) నిజం తెలిస్తే అంత కూల్‌గా ఉంటుందా చెప్పు? ముందే ఎందుకు చెప్పలేదు అని రచ్చ చేసేది. కానీ అలా చేయలేదంటే ఏం తెలియదనేగా అర్థం? నువ్వు భయపడకు దీపా’ అని చెప్పి వెళ్లిపోతుంది సరోజా. అయితే దీప వంట చేసుకుంటూ కూడా సౌర్య మాటలు తలుచుకుంటూ టెన్షన్ పడుతూనే ఉంటుంది.

సౌర్య కోసం హిమ చాక్లెట్

సౌందర్య హిమని స్కూల్‌కి తీసుకుని వెళ్తుంది. హిమ ఆలోచనలో పడుతుంది. ‘మీ అమ్మకి మా నాన్నకి పెళ్లి చేద్దామా?’ అని సౌర్యని అడిగినందుకు సౌర్య కొట్టబోయిన సీన్ తలుచుకుని.. ‘ఇప్పుడు సౌర్య బ్యాగ్ తీసుకొచ్చినందుకు తిడుతుందేమో’ అని భయపడుతూ అదే విషయం సౌందర్యకు చెప్పి కారు ఆపమంటుంది. వెంటనే సౌర్యకు చాక్లెట్ కొని తీసుకొచ్చి.. సౌర్యకు ఇస్తానని చెబుతుంది.

సౌర్య అసహనం

వారణాసి ఆటోలో కూర్చున్న సౌర్య.. ‘వీడి(వారణాసి)కి మా నాన్న గురించి తెలుసా? తెలిసే తెలియనట్లు నటిస్తున్నాడా?’ అంటూ రగిలిపోతుంది. వెనుక నుంచి బాగా వారణాసి కొడుతుంది. తర్వాత ‘మీ అమ్మకి మా నాన్నకి పెళ్లి చేద్దామా?’ అనే హిమ మాటలు తలుచుకుని.. ఇంకా నయం హిమని కొట్టాను కాదు. తను చాలా మంచిది’ అనుకుంటూ వారణాసిని ఆటో ఆపమని చెప్పి హిమ కోసం చాక్టెట్స్ కొని తెస్తుంది.

మౌనితే కరెక్ట్

కార్తీక్ ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. దీప, సౌర్యలు గురించి, మౌనిత అన్న మాటల గురించి తలుచుకుంటూ ఉంటాడు. ‘మౌనిత చెప్పినట్లు ఇందులో నా తప్పు కూడా ఉంది. దీపకు లేని ఆశలు కలిపించింది నేనే. అలా చేసి ఉండకూడదు’ అనుకుంటాడు. తర్వాత ఫోన్ అందుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడతాడు.

హిమ సౌర్యల మీటింగ్

సౌందర్య హిమని తీసుకుని వస్తుంది. సౌర్యని వారణాసి స్కూల్ ముందు దింపి వెళ్తాడు. హిమ, సౌర్యలు ఒకరినొకరు కలుసుకుని చాక్లెట్స్ ఇచ్చుకుంటారు. అయితే సౌందర్యతో సౌర్య కావాలనే.. ‘ఈ రోజు ఉదయాన్నే అద్దంలో చూసుకుంటే.. నా కలర్ మీ కలర్ ఒకేలా అనిపించింది. మా అమ్మ ఎప్పుడూ అంటుంది నువ్వు మీ నాన్నమ్మలా ఉంటావు అని. అదే నిజమేమో’ అంటూ కావాలనే నవ్వుతుంది.

కమింగ్ అప్‌లో…

దీప, హిమలు ఒకచోట కూర్చుంటారు. ‘వంటలక్కా… మా డాడీని చూశావ్ కదా? తను చాలా మంచి వాడు. తనని మా ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం’ అంటూ ఏదేదో చెప్పడం మొదలు పెడుతుంది. అంతా వింటున్న దీప.. ‘ఇదంతా ఎందుకు చెబుతున్నావమ్మా?’ అని అడగడంతో.. ‘నువ్వు మా డాడీని పెళ్లి చేసుకుంటావా వంటలక్కా?’ అని అడుగుతుంది హిమ. దీప ఒక్కసారిగా షాక్ అయ్యి పైకి లేస్తుంది. ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సీన్ ఇదే. ఈ సీన్ రేపు ఎపిసోడ్‌లో రానుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.