నాన్నకు మంచు వారి అమ్మాయి సర్‌ ప్రైజ్‌

మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. ఆమె తరచు తన ఫ్యామిలీ ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తన తండ్రి మోహన్ బాబు తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ సరదాగా గడిపిన మూమెంట్స్ ను షేర్‌ చేసుకుంది. ఈ సందర్బంగా ఆమె తన తండ్రిని సర్‌ ప్రైజ్‌ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. షూటింగ్‌ లతో బిజీ బిజీగా గడిపే తాము ఇలా మాల్దీవులకు వెళ్లినట్లుగా చెప్పింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఫొటోలు షేర్‌ చేసిన మంచు వారి అమ్మాయి గత రాత్రి బీచ్ లో సరదాగా గడిపాము. నాన్న నటించిన సినిమాల్లోని కొన్ని పాటలను ప్లే చేస్తూ నాన్నకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసి డిన్నర్‌ చేస్తూ చాలా అహ్లాదకరంగా గడిపాం. ఇలా మా కోసం మేము టైం కేటాయించుకోక చాలా కాలం అయ్యింది. ఇన్నాళ్లకు చాలా ఆనందంగా గడిపాము అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పేర్కొంది. మా అందరికి ఎప్పటికి గుర్తుండి పోయే రోజులుగా ఇవి నిలిచాయి అంటూ మోహన్‌ బాబు తో పాటు ఆయన భార్య కూడా అన్నారట.