ఇది అందరు హీరోల ఫ్యాన్స్‌కు గుణపాఠం కావాలి

మీరా చోప్రా విషయంలో ఎన్టీఆర్‌ వ్యవహరించిన తీరు ప్రస్తుతం వారి మెడకు చుట్టుకుంది. ఎన్టీఆర్‌ ఎవరో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేసినందుకు గాను మీరా చోప్రాను బూతులు తిడుతూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ చేశారు. అందుకోసం ఒక హ్యాష్‌ ట్యాగ్‌ ను వారు క్రియేట్‌ చేశారు. ఆ హ్యాష్‌ ట్యాగ్‌ తో ఏకంగా 30 వేల ట్వీట్స్‌ నమోదు అయినట్లుగా సైబర్‌ క్రైమ్‌ వారు నిర్ధారణకు వచ్చారు.

అసభ్యంగా ట్వీట్‌ చేసిన ప్రతి ఒక్క అభిమాని ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. కొందరు వాట్సప్‌ ద్వారా మరికొందరు మెయిల్‌ ద్వారా నోటీసులు అందుకున్నట్లుగా తెలుస్తోంది. వారందరు కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు అనుభవించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. హ్యాష్‌ ట్యాగ్‌ ఎవరు క్రియేట్‌ చేశారు అనే విషయంలో ప్రస్తుతం ఎంక్వౌరీ చేస్తున్నారు. త్వరలోనే ఆ విషయాన్ని గుర్తిస్తే కేసు మరింత పురోగతి సాధించినట్లు అవుతుంది.

ఈ కేసు తీరు తెన్నులు చూస్తుంటే మరోసారి ఏ హీరో అభిమానులు కూడా ఇలా చేయక పోవచ్చు అనిపిస్తుంది. హీరోపై అభిమానంతో వారు ఆవేశంతో చేసిన ట్వీట్స్‌ ప్రస్తుతం వారి కెరీర్‌కే దెబ్బ కొట్టేలా ఉన్నాయి. కనుక మరెప్పుడు కూడా ఇతర హీరోల ఫ్యాన్స్‌ ఇలా ఒక లేడీని కాని ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసి విమర్శలు చేయక పోవచ్చు అంటున్నారు. హీరోల ఫ్యాన్స్‌ కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఉదంతం ఒక గుణపాఠంగా నిలిచి పోతుంది.