బిగ్ బాస్4: ఎపిసోడ్37- రసవత్తరంగా నామినేషన్‌, కెప్టెన్‌ పవర్‌ తో మెహబూబ్‌ సేఫ్‌

తెలుగు బిగ్‌ బాస్‌ నిన్న సోమవారం ఎపిసోడ్‌ అవ్వడంతో ఎక్కువ శాతం ఎలిమినేషన్‌ కు సంబంధించిన పక్రియ జరిగింది. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ పక్రియ హాట్‌ హాట్‌ గా జరిగింది. ఈ సారి మరింత హాట్‌ గా ఉండేందుకు గాను ఎండు మిర్చీల దండలను బిగ్‌ బాస్‌ పంపించాడు. ఆ దండలతో ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరు చొప్పున ఎలిమినేషన్‌ కు నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ ఎలిమినేషన్‌ పక్రియలో ఈసారి ఎక్కువ ఓట్లు దివికి పడ్డాయి. ఈ సారి కెప్టెన్‌ అవ్వడం వల్ల సోహెల్‌ ఎలిమినేషన్‌ నుండి సేఫ్‌ అయ్యాడు. ఇక అమ్మ రాజ శేఖర్‌ మరియు అవినాష్‌ లకు ఒక్క మిర్చి దండ కూడా పడలేదు. వీరి ముగ్గురు కాకుండా చాలా దండలు పడ్డ మెహబూబ్‌ ను కెప్టెన్‌ తన పవర్‌ ను ఉపయోగించి సేఫ్‌ చేశాడు. సోహెల్‌ కు మెహబూబ్‌ కెప్టెన్సీలో సహకరిస్తే నిన్నటి ఎపిసోడ్‌ లో మరో ఆలోచన లేకుండా మెహబూబ్‌ ను సోహెల్‌ సేఫ్‌ చేయడం జరిగింది. మోహబూబ్‌ కన్నీరు పెట్టుకుని ఎలిమినేషన్‌ పక్రియ తర్వాత సోహెల్‌ ను హగ్‌ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి గేమ్‌ ఆడుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక మొత్తంగా ఈ వారం ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వారు అరియానా, అభిజిత్‌, మోనాల్‌, కుమార్‌ సాయి, దివి, అఖిల్‌, నోయల్‌, లాస్య మరియు హారికలు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా మొత్తం 9 మందిని ఎలిమినేషన్‌ కు నామినేట్‌ చేశారు. ఒక్క ఒక్క దండ పడ్డ వారిని కూడా నామినేషన్‌ లో ఉన్నట్లుగా బిగ్‌ బాస్‌ ప్రకటించడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. లాస్య మరియు హారిక ఇంకా నోయల్‌ లు ఈవారం ఎలిమినేషన్‌ లో ఉండక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని మొత్తం సీన్‌ రివర్స్‌ అన్నట్లుగా ఈసారి ఆ నలుగురు మినహా మొత్తం నామినేట్‌ అయ్యారు. ఈ వారం వీక్‌ కంటెస్టెంట్‌ ఎవరు అనుకుంటే కుమార్‌ సాయి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుమార్‌ సాయి కాకుండా ఎవరు ఎలిమినేట్‌ అయినా కూడా సంచలనమే అనడంలో సందేహం లేదు.

ఎలిమినేషన్‌ పక్రియకు ముందు బిగ్‌ బాంబ్‌ పడ్డ సోహెల్‌ అంట్లు రుద్దుతున్న సమయంలో జరిగిన గొడవలో అరియానా హైపర్‌ యాక్టివ్‌ అయ్యింది. ఆమె సోహెల్‌ ను పొగరు చూపించకు అంటూ మాట అనేసింది. అదే కోపం ను నామినేషన్‌ సమయంలో కూడా కొనసాగించింది. దాంతో ఆమెకు ఈ వారం కాస్త ఓట్ల విషయంలో ప్రభావం పడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరుగబోతుంది అనేది నేటి ఎపిసోడ్‌ నుండి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.