అక్కడ రాణానే లీడింగ్‌లో వున్నాడు

ఆగస్టు 11కి వస్తున్నవి మూడూ క్రేజీ చిత్రాలే కావడంతో ముందుగా ఏది చూడాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలానా సినిమా ముందుగా చూడాలంటూ ఎవరూ ఒకదానికే మూకుమ్మడిగా ఓటు వేయడం లేదు.

కొందరు లై కోసం, ఇంకొందరు జయ జానకి నాయక కోసం, మరికొందరు నేనే రాజు నేనే మంత్రి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ పరంగా మాత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ లీడింగ్‌లో వుంది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా ఈచిత్రానికే అడ్వాన్స్‌ బుకింగ్‌ స్పీడ్‌గా వుంది. మూడిట్లో ఇదే చిన్న సినిమా అని భావిస్తున్నా కానీ క్రేజ్‌ పరంగా ఈ చిత్రం మిగతా వాటిని పక్కకి నెట్టేసి ముందుకి దూసుకెళ్లిపోయింది.

తేజ కట్‌ చేసిన ట్రెయిలర్‌కి తోడు, బాహుబలి తర్వాత రాణాకి పెరిగిన ఫాలోయింగ్‌ కూడా దీనికి కారణం కావచ్చు. మిగిలిన రెండు సినిమాల కంటే ముందుగా థియేటర్లు అనౌన్స్‌ చేసి, బుకింగ్‌ ఓపెన్‌ చేసేయడం కూడా దీనికి కలిసి వచ్చింది. లైవ్‌ బుకింగ్‌లో ‘రాజు మంత్రి’ని బీట్‌ చేసేలా లై, జయ జానకి నాయక పర్‌ఫార్మ్‌ చేయాలి.