బిగ్ బాస్ 5 కూడా పోస్ట్ పోన్ కానుందా?

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకూ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఒకదాన్ని మించి మరొక సీజన్ సూపర్ హిట్ కావడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా గతేడాది కోవిద్ సమయంలో కూడా ఈ షో ను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా నాలుగు సీజన్లలో హయ్యస్ట్ రేటడ్ షో గా నిలిచింది. సాధారణంగా సమ్మర్ తర్వాత బిగ్ బాస్ ను నిర్వహిస్తారు.

కానీ గతేడాది కోవిద్ కారణంగా సెప్టెంబర్ లో మొదలుపెట్టి డిసెంబర్ లో ముగించారు. ఈ ఏడాది మళ్ళీ సాధారణంగానే మొదలుపెట్టాలని భావించారు బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఈ విషయంలో వారికి మరోసారి చుక్కెదురైంది.

జూన్ లేదా జులైలో బిగ్ బాస్ ను మొదలుపెట్టాలని దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ ను కూడా సిద్ధం చేసారు. పాల్గొనబోయే ప్రాబబుల్ లిస్ట్ ను ప్రిపేర్ చేసారు. అయితే మళ్ళీ కోవిద్ పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో బిగ్ బాస్ లేనట్లే.