త్రివిక్రమ్ తోనూ పనిచేయనున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే గత సంవత్సరం మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. కరోనా రాకపోయి ఉండి ఉంటే ఈపాటికి రెండు సినిమాలు విడుదలయ్యేవి కూడా.

అయితే ఇప్పుడు వకీల్ సాబ్ విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు, మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హరీష్ శంకర్ సినిమాను కూడా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పనిచేసే అవకాశాలు ఉన్నాయిట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అది పూర్తైన తర్వాత పవన్ తో సినిమా చేస్తాడట. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది.