జనసేనాని కౌలు రైతుల భరోసా యాత్రపై అక్కుపక్షి వెకిలి రాతలు.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతులకు భరోసా ఇచ్చందుకోసం అనంతపురం జిల్లా నుంచి ఓ అద్భతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున చెరో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు జనసేన ప్రకటించింది. జనసేన నిన్న పలు కుటుంబాల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.

కానీ, అక్కుపక్షి రాతలు వేరే వున్నాయ్. అక్కు పక్షి పుట్టిందే అక్రమార్జన నుంచీ, అవినీతి సొమ్ము నుంచీ కదా.! ఆ బులుగు కళ్ళతో చూస్తే అన్నీ అలానే కనిపిస్తాయ్. ప్రభుత్వం ఏడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్న అందించేసిందట బాధిత కుటుంబానికి. ఆ విషయం తెలిసి పవన్ కళ్యాణ్, చల్లగా జారుకున్నారట. ఐదు నిమిషాల్లోనే తన పర్యటన ముగించేసుకున్నారట.

బాధిత కుటుంబాలు ఎలా రోదిస్తున్నాయో చూసేంత తీరిక, ఓపిక అక్కుపక్షికి ఎలా వుంటుంది.? అందులో వంకర రాత తప్ప, వాస్తవమైన రాత రాస్తే.. రాసినోళ్ళకి ఎలాంటి గతి పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రైతు కుటుంబంలోని చిన్న పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య లబోదిబోమంటున్నారు. చిన్న పిల్లల్ని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దాంతో, బాధిత కుటుంబానికి కొంత ఓదార్పు లభించినట్లయ్యింది.

తండ్రి మరణిస్తే, ఆ మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ఓదార్పు యాత్ర చేసిన బులుగు నాయకుడెక్కడ.? కౌలు రైతు కుటుంబాలకు బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఎక్కడ.? రాజకీయాల్లో విమర్శలుండొచ్చు.. విషపు రాతలూ వుండొచ్చు. మరీ, రైతుల మీద ఇలాంటి రాతలా.?

జగన్ సర్కారు, రైతుల్ని అంతలా ఉద్ధరించేస్తోంటే, రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు.? పరిపాలన అంత గొప్పగా వుంటే, రాష్ట్రాన్ని కరెంటు కోతలెందుకు వెంటాడుతున్నట్టు.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అక్కుపక్షి తీరు.

అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే, దాన్ని ‘గుండె పోటు’గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అక్కుపక్సి నుంచి ఇలాంటి వార్తలే వస్తాయ్. అందులో ఆశ్చర్యమేమీ లేదు.