చెర్రీ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్… ఎవరు పంపించారు నిన్ను?

ఆమద్య స్టార్ హీరోల పబ్లిక్ ఈవెంట్స్ సందర్బంగా అభిమానుల అత్యుత్సాహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అభిమానులు ఒకరు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోను హగ్ చేసుకోవడం.. లేదా కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించడం చేస్తున్నారు. మొదట్లో ఇలా పరిగెత్తుకుంటూ రావడం నిజంగానే జరిగింది. కాని ఆ తర్వాత తర్వాత ఇది ఫేక్ గా మారింది అనిపిస్తుంది.

స్టార్ హీరోల పీఆర్ టీమ్ లేదా చిత్రానికి సంబంధించిన వారు ఇలాంటి ఒక అరేంజ్ మెంట్ ను చేస్తున్నారు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి హీరో కాళ్ల మీద పడటం.. ఆ పడ్డ అభిమానిని సెక్యూరిటీ వారు లాక్కెళ్లుతుంటే హీరో పిలిచి అతడితో మాట్లాడి ఫోటో దిగడం చాలా వేడుకల్లో చూశాం. అచ్చు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా కూడా ఇలాంటి సంఘటన జరిగింది.

రామ్ చరణ్ కాళ్ల మీద పడ్డ అభిమాని విషయం హాట్ టాపిక్ అయ్యింది. పరిగెత్తుకుంటూ వచ్చిన తన కాళ్ల మీద పడ్డ అభిమానిని లేపి నిన్ను ఎవరు డిజైన్ చేశారు.. ఎవరు పంపించారు అన్నట్లుగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో కావాలని పంపించారు అంటూ రామ్ చరణ్ మాటలతో అర్థం అవుతుంది. కొందరు పీఆర్ టీమ్ ఆ హీరోలకు కూడా తెలియకుండా ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు.

ఆమద్య సంపూర్నేష్ బాబు సినిమా ఈవెంట్ సందర్బంగా కూడా ఇలాంటిది జరిగింది. అది కావాలని ప్లాన్ చేశారు అంటూ క్లీయర్ గా క్లారిటీ వచ్చింది. మరో సినిమా వేడుకలో ఇలా పరిగెత్తుకుంటే వస్తే మేమే ప్లాన్ చేశామని అనుకుంటారు అంటూ సరదాగా ఆ హీరో వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి ఇలా అభిమానులు రావడం ప్లాన్ ప్రకారం జరుగుతుందని తేలిపోయింది.

పదుల కొద్ది సెక్యూరిటీ వారు స్టేజ్ కు చుట్టు ఉంటారు. అలాంటి వారి నుండి తప్పించుకుని అభిమాని వెళ్లడం అంటే చాలా పెద్ద విషయం. అందరిని తోసుకుని వెళ్లడం.. అది కూడా డైరెక్ట్ గా హీరో మాట్లాడుతున్న సమయంలో వెళ్లడం అనేది చాలా కష్టమైన విషయం. ప్లాన్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. కనుక ఆచార్య సందర్బంగా కూడా చరణ్ కు తెలియకుండా ప్లాన్ చేశారేమో అంటున్నారు.

స్టార్ హీరోలు ఇలాంటివి ఎంకరేజ్ చేయడం లేదు. కాని వారి మొప్పును పొందడం కోసం ఈవెంట్ ను నిర్వహించిన వారు లేద ఆ హీరో పర్సనల్ పీఆర్ టీమ్ వారు ప్లాన్ చేసి మరీ ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. ముందు ముందు ఇలాంటివి జరగకుంటే ఉంటే మంచిది అనేది కొందరి అభిప్రాయం. కొందరు మాత్రం అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితేనే ఆ ఈవెంట్ గురించి ఎక్కువ మంది చర్చించుకుంటారు అంటున్నారు.