#RRR ఇంకా ఆ డీల్స్ పూర్తి అవ్వలేదట

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే నెలలో సినిమాకు గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో సినిమా బిజినెస్ కూడా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే దాదాపు 290 కోట్ల రూపాయలకు సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్ అమ్మేశారు అనే వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటి అంటే 290 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిన మాట వాస్తవం కానీ ఇప్పటి వరకు డీల్ క్లోజ్ కాలేదు అంటూ సమాచారం అందుతోంది.
అమెజాన్ వారు సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కు 160 కోట్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. నిర్మాతలు మాత్రం 200 కోట్ల కోసం నెట్ ఫిక్స్ తో చర్చలు జరుపుతున్నారట. ఇక శాటిలై రైట్స్ ను 130 కోట్లకు స్టార్ మా కొనుగోలు చేయాలనుకున్న 150 కోట్ల డీల్ కోసం జీ తెలుగు మరియు సన్ నెట్ వర్క్ తో చర్చలు జరుపుతున్నారట. మొత్తంగా శాటిలైట్ మరియు డిజిటల్ ద్వారా 350 కోట్లను రాబట్టాలని మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది.