ఆర్ ఆర్ ఆర్ థియేటర్లలోనే విడుదలవుతుంది: నిర్మాతలు

నిన్నటి నుండి సోషల్ మీడియాలో వచ్చిన వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అలియా భట్ నటించిన ఆర్ ఆర్ ఆర్, బాలీవుడ్ చిత్రం గంగూభాయ్ కథైవాడ చిత్రాలు థియేటర్లను స్కిప్ చేసి ఓటిటిలో విడుదలవుతుందని ప్రచారం మొదలైంది. దీంతో పాటు ఎటాక్ చిత్రం కూడా ఇదే రూట్ లో వెళుతుందని రూమర్స్ వచ్చాయి.

ఈ మూడు సినిమాల హిందీ డిస్ట్రిబ్యూషన్ ను పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. ఈ రూమర్స్ మరింతగా స్ప్రెడ్ అవ్వకముందే పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ్డా క్లారిటీ ఇచ్చాడు.

“గంగూభాయ్ కథైవాడ, ఆర్ ఆర్ ఆర్, ఎటాక్ చిత్రాలు థియేటర్లలోనే విడుదలవుతాయి. అవి ఓటిటి ప్లాట్ ఫాన్స్ లో విడుదలవుతాయి అన్న దాంట్లో ఎలాంటి నిజం లేదు. ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రాలు బిగ్ స్క్రీన్ లోనే ఎక్స్పీరియన్స్ చేయడానికి రూపొందించారు. అవి థియేటర్లలోనే విడుదలవుతాయి” అని స్టేట్మెంట్ లో తెలిపాడు జయంతిలాల్.