నానికి టెన్షన్ మీద టెన్షన్!!

న్యాచురల్ స్టార్ నాని గత రెండు చిత్రాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి. దీంతో తన నెక్స్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ ను కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటకు తగ్గట్లుగానే శ్యామ్ సింగ రాయ్ ను డిసెంబర్ 24న క్రిస్మస్ వీకెండ్ సందర్భంగా విడుదల చేయడానికి ఫిక్స్ చేసారు.

దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుకోకుండా అదే రోజున, డిసెంబర్ 24న వరుణ్ తేజ్ గని చిత్రం విడుదలకు షెడ్యూల్ అయింది. అయితే ఆ సినిమా వాయిదా పడుతుందా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ కు మరో పోటీ వచ్చి పడింది. రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందిన పీరియడ్ డ్రామా 83 అదే రోజున విడుదలవుతోంది. ఇండియన్ క్రికెట్ టీమ్ మొదటిసారి ప్రపంచ కప్ ను సాధించిన సందర్భంగా ఈ చిత్రానికి భాష బేధం లేకుండా కచ్చితంగా క్రేజ్ ఉంటుంది.