మహేష్ చిత్రంలో సుమంత్ నటిస్తున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోవిద్ కారణంగా నిలిచిపోయింది. రీసెంట్ గా మహేష్ నటించే 28వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పనిచేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో చిత్రం అనగానే మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటుడు సుమంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర చేసిన విషయం తెల్సిందే. అదే తరహాలో మహేష్ చిత్రంలో సుమంత్ చేత ఒక కీలక పాత్ర చేయిద్దాం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా మహేష్, సుమంత్ కు మంచి ర్యాపొ కూడా ఉంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.