తమన్నాకు ఇంకా అంత డిమాండ్ ఉందా?

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ ఆరంభించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా స్టార్‌ కు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. తమన్నా ప్రస్తుతం పెద్ద హీరోలకు జోడీగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. అయినా కూడా ఈమె బిజీగానే ఉంది. సినిమాలు, వెబ్‌ సిరీస్ మరియు టీవీ షో లు అంటూ ఫుల్‌ గా బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా వరుణ్‌ తేజ్ మూవీ గనిలో ఐటెం సాంగ్‌ ను చేసింది.

గని సినిమా లో ఐటెం సాంగ్‌ ను చేసినందుకు గాను తమన్నా ఏకంగా రూ. 75 లక్షలను పారితోషికంగా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కేవలం వారం రోజుల షూటింగ్‌ లో తమన్నా పాల్గొంది. అయినా కూడా పెద్ద మొత్తంలో పారితోషికంను తీసుకుంది. తమన్నాకు ఈ సమయంలో అంత డిమాండ్‌ ఉందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా నిజంగా అంత పారితోషికం తీసుకుందా అంటే అనుమానమే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఆమె ఆ పారితోషికం తీసుకుని ఉంటుందని అంటున్నారు.