టిక్ టాక్ దుర్గారావుకు పాపులారిటీ తగ్గుతోందా?

టిక్ టాక్ ద్వారా దుర్గారావు అతని భార్య ఎంత పాపులారిటీ సంపాదించారో అందరికీ తెలుసు. టిక్ టాక్ లో వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన దుర్గారావు ఢీ షో లో పండు వేసిన డ్యాన్స్ కారణంగా బుల్లితెరపై కూడా ఫుల్ ఫేమస్ అయ్యాడు. అయితే అటు నుండి జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన దుర్గారావు, రీసెంట్ గా విడుదలైన క్రాక్ సినిమాలో కూడా ఒక సాంగ్ లో మెరిశాడు.

బుల్లితెరపై దుర్గారావు ఈ మధ్య బాగానే కనిపిస్తున్నాడు. తన డ్యాన్స్ లతో అలరిస్తున్నాడు. ఇదే క్రమంలో యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలుపెట్టాడు దుర్గారావు. అయితే దీనికి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదని చెప్పాలి. అలాగే ఇటీవలే ఒక మ్యూజిక్ వీడియోను కూడా విడుదల చేయగా దానికి వ్యూస్ లేవు. జబర్దస్త్ ఆర్టిస్టులు మొత్తంగా దుర్గారావును సపోర్ట్ చేస్తున్నా కానీ ఎందుకో ఇదివరకటిలా హైలైట్ అవ్వలేకపోతున్నాడు. టిక్ టాక్ లో వేస్తోన్న చిన్న చిన్న డ్యాన్స్ లు తప్పితే దుర్గారావు పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.