అంత పెద్ద స్టార్లతో మల్టీస్టారర్ అంటే.. సాధ్యమేనా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో కూడా ఆయన మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మధ్యే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించనున్నానని ప్రకటించారు. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అందులో ఒకటి The GOAT (GREATEST OF ALL TIME). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇక విజయ్ సినీ కెరీర్ లో చివర మూవీ ద‌ళ‌ప‌తి 69ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌ డీవీవీ దానయ్య నిర్మించడానికి ముందు వచ్చారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మాతగా ఆల్మోస్ట్‌ కన్ఫామ్ అయ్యారని టాక్ వచ్చింది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తప్పుకుందని సమాచారం.

అయితే దళపతి 69 మూవీ నిర్మాత మారడంతో ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది కూడా ఆడియన్స్ లో ప్రశ్న మొదలైంది. ఇప్పటి వరకు ఈ సినిమా హెచ్ వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే టాక్ ఉంది. కానీ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఇంతలో కోలీవుడ్ మరో స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేసిన విషయం తెలిసిందే.

విజయ్ 69వ మూవీ తెరకెక్కించే ఛాన్స్ తనకు వస్తే భారీ మల్టీస్టారర్ గా తీస్తానని చెప్పారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఈ సినిమా కోసం తీసుకొస్తానని వెల్లడించారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్, విజయ్, షారుఖ్, మమ్ముట్టి కాంబోలో మూవీ వస్తే వేరే లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పినట్టు జరిగితే..

భారతీయ సినీ చరిత్రలో సెన్సేషనల్ మల్టీస్టారర్ గా దళపతి 69 నిలిచిపోతుందని చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీలో మల్టీస్టారర్స్ కు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. సినీ ప్రియులతో పాటు ఆయా హీరోల ఫ్యాన్స్ మూవీని మినిమమ్ హిట్ చేసేస్తారు. మరి దళపతి 69 విషయంలో ఏం జరుగుతుందో, నెల్సన్ కు ఛాన్స్ వస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.