ఏపీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ కేటాయింపులు ఇవే

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదికి కూడా బడ్జెట్‌ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. మంత్రి వర్గ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్ కు ఓకే చెప్పారు. మూడు నెలల బడ్జెట్‌ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కేటాయింపులను చేయడం జరిగింది. మూడు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టబోతున్నట్లుగా ఈ సందర్బంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

బడ్జెట్‌ కేటాయింపులు..
మూడు నెలలకు మొత్తం రూ.70,983.11 కోట్ల కేటాయింపులు
స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన, మైనరార్టీ, వికలాంగుల సంక్షేమం కోసం రూ.10 వేల కోట్లు
రెవిన్యూ వ్యయం కోసం రూ.7171 కోట్ల కేటాయింపులు
పెట్టుబడి వ్యయం కోసం రూ. 167.64 కోట్లు
నీటి పారుదల రంగం ప్రాజెక్ట్‌ల కోసం రూ. 2,000 కోట్లు
వైధ్య రంగం కోసం రూ. 3,567 కోట్లు
విద్యారంతం కోసం రూ. 7,972 కోట్లు కేటాయించారు.