సీఎం జగన్‌ కు సీబీఐ కోర్టు సమన్లు

వాన్ పిక్ వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. వాన్ పిక్ ప్రాజెక్ట్‌ వ్యవహారంలో మనీలాండరింగ్ కు పాల్పడ్డట్లుగా సీబీఐ మరియు ఈడీలు జగన్ పై అభియోగపత్రాన్ని కోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ అభియోగ పత్రంపై విచారణ చేపట్టేందుకు గాను కోర్టు స్వయంగా సీఎంగా కోర్టుకు హాజరు అవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఈ కేసులో వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కేవీ బ్రహ్మానంద రెడ్డి మరియు నిమ్మగడ్డ ప్రసాద్‌ ఇంకా కొందరు ప్రముఖులకు కూడా సమన్లు జారీ చేసినట్లుగా కోర్టు అధికారుల ద్వారా తెలుస్తోంది. వాన్‌ పిక్ వ్యవహారంలో చేతులు మారిన డబ్బుల గురించి మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ సుదీర్ఘంగా జరిగింది. జగన్‌ మరియు ఆయన కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు సంబంధించిన లావాదేవీల విషయంలో మనీలాండరింగ్‌ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు విచారణ ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.