
లెక్కప్రకారం గతేడాది నవంబర్ నాటికే సినిమా పూర్తవ్వాలి. కానీ అలాఅలా చెక్కుకుంటూ 2018లోకి లాక్కొచ్చారు. కనీసం జనవరిలోనైనా సినిమా కంప్లీట్ అవుతుందని ఎదురుచూస్తే అది ఫిబ్రవరి వరకు సాగింది. ఎట్టకేలకు రంగస్థలం సినిమా పూర్తవ్వబోతోంది. ఈఆదివారం ఈసినిమాకు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు.ఫైనల్ షెడ్యూల్ లో ఐటెంసాంగ్, కొంత ప్యాచ్ వర్క్ పెట్టుకున్నారు. చరణ్, పూజా హెగ్డేతో తీసిన ఐటెంసాంగ్ షూటింగ్ పూర్తయింది. రేపు, ఎల్లుండి ప్యాచ్ వర్క్ పూర్తిచేసి సినిమా షూటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 30శాతం అదనంగా ఖర్చు చేశారు. షెడ్యూల్స్ ఎక్కువగా సాగడంతో పాటు రాజమండ్రిలోని సహజమైన లొకేషన్లలో తీయాల్సిన సన్నివేశాల కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేయడం వల్ల బడ్జెట్ తడిసిమోపెడైంది.
సినిమాకు సంబంధించి మార్చి మొదటివారంలో ఆడియో ఫంక్షన్, చివరి వారంలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించారు. ఈరెండూ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మార్చి 30న రంగస్థలం థియేటర్లలోకి వస్తుంది.
Recent Random Post:

















