ఏం చేయాలో అర్థంకాక మొత్తం లేపేశారు

సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. నెగెటివ్ రెస్పాన్స్ వచ్చిందని హీరోయిన్ నటించిన సన్నివేశాలన్నీ కట్ చేశారు. ఫస్టాఫ్ పూర్తిగా తగ్గిపోయింది. సినిమా బ్యాలెన్స్ తప్పింది. మళ్లీ ఏం కలపాలో అర్థంకాలేదు. దీంతో ఏకంగా సినిమానే థియేటర్లలోంచి లేపేశారు. ఈ విచిత్ర సంఘటన కోలీవుడ్ లో జరిగింది. ఆ సినిమా పేరు కేరాఫ్ సూర్య.

తమిళ్ లో ఈ సినిమా నెంజిల్ తునివిరుందల్ పేరుతో విడుదలైంది. అక్కడ కూడా దీనికి ఫ్లాప్ టాకే వచ్చింది. హీరోయిన్ నటించిన సీన్స్ లేపేసినా ఫలితం లేకపోవడంతో ఏకంగా థియేటర్లలోంచి సినిమాను తీసేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కోలీవుడ్ లో ఈ సినిమాకు ఈరోజే ఆఖరి రోజు.

థియేటర్ల నుంచి తీసేసిన తర్వాత సినిమాకు రిపేర్లు చేయబోతున్నారు. అవసరమైతే మరికొన్ని సీన్లు రీషూట్ చేస్తారట. అలా ఫస్టాఫ్ ను గ్రిప్పింగ్ గా తయారుచేసి, మరోసారి మూవీని రిలీజ్ చేస్తారట. అవును… వచ్చేనెల 15న ఈ సినిమా రీ-రిలీజ్ కానుంది.

ఆల్రెడీ ఫ్లాప్ టాక్ వచ్చేసిన సినిమాకు రిపేర్లు చేసి నెల రోజులు తర్వాత రిలీజ్ చేస్తే హిట్ అవుతుందా..? ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులు మరోసారి సినిమా చూస్తారా..? ఈ వెరైటీ ప్రయోగం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.


Recent Random Post: