ఏడేళ్ల క్రితం ఆగిన రాజశేఖర్‌ సినిమాను తీసుకు వస్తున్న వర్మ

రాజశేఖర్‌ హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా పట్ట పగలు. సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించిన తర్వాత సినిమా విడుదల క్యాన్సిల్‌ అయ్యింది. తనకు చెప్పిన కథతో కాకుండా సినిమాను మరోలా తీశారంటూ వర్మపై రాజశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం నెల రోజుల్లోనే వర్మ ఆ సినిమాను తీశాడు. చిన్న బడ్జెట్‌ తో రూపొందిన పట్టపగలు సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ మరియు టీజర్ కూడా వచ్చింది. అలాంటి సినిమాను ఆపేయడం జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ పట్ట పగలు సినిమా టైటిల్‌ ను కాస్త ఆర్జీవీ దెయ్యం అంటూ మార్చి విడుదలకు సిద్దం చేశారు. ఈనెల 16వ తారీకున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అదే రోజున నాగ చైతన్య, సాయి పల్లవి లవ్‌ స్టోరీ విడుదల కాబోతుంది. కనుక ప్రేక్షకులు వర్మ సినిమాను పట్టించుకుంటారా అంటే అనుమానమే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. అప్పుడు ఒప్పుకోని రాజశేఖర్‌ ఇప్పుడు విడుదలకు ఎలా ఒప్పుకుంటున్నాడు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో రాజశేఖర్‌ కు కూతురుగా స్వాతి దీక్షిత్‌ నటించింది. కూతురుకు దెయ్యం పడితే తండ్రి పడే బాధను ఈ సినిమాలో చూపించారు.