ఒకే ఫ్రేమ్ లో నందమూరి సిస్టర్స్!

వెండి తెర హీరోల? అక్కా-చెల్లెళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా! రేర్ గా.. అకేషనల్ గా కలుసుకోవడం జరుగుతుంటుంది. గెట్ టూ గెదర్ పార్టీల్లో మెగా సిస్టర్స్ ని ఎన్నోసార్లు ఒకే ప్రేమ్ లో చూసాం. ఇంకా ఘట్టమేని సోదరిమణులు…దుగ్గుబాటి కుటుంబ సభ్యుల్ని చూసిన సందర్భాలున్నాయి. కానీ నందమూరి అక్కాచెల్లెళ్లు… తారకరామారావు కుమార్తెలు మాత్రం ఒకే ప్రేమ్ లో చిక్కింది చాలా అరుదు.

అందులోనూ మీడియా కంట పడటం అన్నది ఇంకా అరుదనే చెప్పాలి. అయితే తాజాగా అలాంటి అరుదైన ఘట్టం మరోసారి చోటు చేసుకుంది. ఇదిగో ఇక్కడిలా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎంతో ఆప్యాయంగా కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి- భువనేశ్వరి-పురందరేశ్వరి ఒకే ప్రేమ్ లో కనిపిస్తున్నారు. ఇద్దరు అక్కల మధ్యలో ముద్దుల చెల్లెలు.. ఒకే చోట కుర్చుని నవ్వుతూ కెమెరాకి ఫోజులిచ్చారు.

ఎడమ నుంచి భువనేశ్వరి-మధ్యలో పురందరేశ్వరి… కుడివైపు చివరన లోకేశ్వరి ఉన్నారు. ఇలా ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాకి లీక్ అవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ముగ్గరు ఉన్న ఫోటో బయటకు రాలేదు. ఈ మధ్యనే అక్కా-చెల్లెళ్లు ఇలా కలిసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అక్కాచెల్లెళ్ల మధ్య సఖ్యత చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.

ఎల్లప్పుడు అక్కా-చెల్లెళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగత రాజకీయ-విబేధాల కారణంగా కొంత కాలంగా ఎవరికి వారు దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ దగ్గరవుతున్నారని తాజా ఫోటోల్ని బట్టి తెలుస్తుంది.

ఏది ఏమైనా రాజకీయంగా వాళ్లు దారలు వేరైనా..అక్కాచెల్లెళ్లుగా ఎప్పుడూ కలిసే ఉంటారు. రాజకీయం మనుషులకే కానీ …మనసులకు కాదని నిరూపించిన మరో అరుదైన సందర్భం ఇది. భువనేశ్వరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతమణికాగా… పురందరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిసిందే.