కబుర్లతో బాబీ కాలక్షేపం?

Sardaar Gabbar Singh Director Bobby Interview Stills

చిరంజీవి మా ఇంటికి వచ్చారు.. ముగ్గురు హీరోలు ఫోన్లు చేసారు. ఇవన్నీ కాదు కావాల్సింది. ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టు ఏమిటీ? అది పాయింట్. జైలవకుశ విడుదల కాకుండానే మరో ప్రాజెక్టు కోసం డైరక్టర్ బాబీ కిందా మీదా అవుతున్నట్లు వార్తలు వినవచ్చాయి. బన్నీ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు అయితే బాబీ ఖాళీ.

లై లాంటి భయంకరమైన ఫ్లాప్ ఇచ్చిన హను రాఘవపూడికి వెంటనే సినిమా దొరికింది. రెండు రోజుల్లో క్లాప్ వినిపించబోతోంది. కానీ హిట్ ఇచ్చిన బాబీకి సినిమా లేదు. ఎందుకని? జైలవకుశ ఎన్టీఆర్ వల్ల ఆడింది అన్న టాక్ కావచ్చేమో? నానితో చేయాలని బాబీ ప్రయత్నిస్తున్నాడు. దాదాపు ఓకె అయినట్లు వార్తలు కూడా వున్నాయి. కానీ ఎప్పుడు అన్నదే తెలియడం లేదు.

గ్యాసిప్ లు ఎన్నయినా వినిపించవచ్చు. సినిమా సెట్ మీదకు వెళితేనే అసలు మజా. హీరోలంతా ఫుల్ బీజీగా వున్నారు. ప్రతి వాళ్ల చేతుల్లో ఒకటికి మూడు సినిమాలు వున్నాయి. డైరక్టర్లు కూడా చాలా వరకు అలాగే వున్నారు. కానీ ఇంకా హీరోలు వుంటే రెడీగా చేయడానికి మరి కొంత మంది డైరక్టర్లు వెయిటింగ్ లిస్ట్ లో వున్నారు. అలాంటి వాళ్లలో బాబీ పేరు ముందు వుంది. ఆ వెయిటింగ్ జాబితాలోంచి, కన్ఫర్మ్ జాబితాలోకి బాబీ పేరు మళ్లీ ఎప్పుడు వస్తుందో?


Recent Random Post: