
తెలంగాణ మంత్రి కేటీఆర్, టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిపై నిన్న తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ విషయం విదితమే. ఓటుకు నోటు కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘దొంగ’గా రేవంత్‌ని అభివర్ణించడమే కాదు, స్కామ్‌ల పార్టీ కాంగ్రెస్‌తో రేవంత్ జతకట్టారంటూ కేటీఆర్ తనదైన స్టయిల్లో ‘విచిత్ర పదజాలాన్ని’ తెరపైకి తెచ్చారు.
రేవంత్ ఊరుకుంటారా.? అసలే, ఆయన మాటల పుట్ట. మీడియాకెక్కి ఇంకా విమర్శలు షురూ చేయలేదుగానీ, ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చారు. 2016లో మలేసియాకి అధికారిక పర్యటన నిమిత్తం వెళ్ళిన కేటీఆర్, అక్కడ తేజ రాజు (సత్యం రామలింగరాజు తనయుడు)ని కలిసిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు రేవంత్‌రెడ్డి. ‘దాచిన సత్యం’ అని హెడ్డింగ్ కూడా పెట్టారండోయ్.
వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ సత్యం రామలింగరాజు తనయుడితో కేటీఆర్ రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏంటన్నది రేవంత్‌రెడ్డి ప్రశ్న. ‘స్కామ్ స్టార్‌తో తిరుగుతున్న దొరకని దొంగ’గా కేటీఆర్‌ని అభివర్ణించిన రేవంత్‌రెడ్డి, ఈ సత్యం తెలంగాణ సమాజం గుర్తించాలంటూ ముక్తాయింపునిచ్చారు. అధికారిక పర్యటనలో ఈ అనధికారిక భేటీ వ్యవహారమై ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీదనే పడింది.
ఇంతకీ, ‘దొరకని దొంగ’ అని కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కేటీఆర్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందట.? వేచి చూడాల్సిందే.
Recent Random Post:

















