
రంగస్థలం సినిమాలో చరణ్ నటనకి సర్వత్రా ప్రశంసలు వస్తోన్న నేపథ్యంలో ఏ దర్శకుడికీ తెలియని కిటుకు మీరేమి కనిపెట్టారని మీడియా సుకుమార్‌ని అడిగింది. ఈ ప్రశ్నకి సమాధానంగా కాస్త మొహమాటంగానే సుకుమార్ ఓ సీక్రెట్ చెప్పాడు. ఇంతవరకు చరణ్ తన కెరియర్లో క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకున్న సినిమా చేయలేదని, కేవలం కథలు, క్యారెక్టర్లు మాత్రమే చేసాడని, క్యారెక్టరైజేషన్ డ్రైవ్ చేసే కథలు చేయకపోవడం వల్లే అతనిలోని పూర్తి నటుడు బయటకు రాలేదని సుకుమార్ అభిప్రాయపడ్డాడు.
ఆరెంజ్ చిత్రంలో క్యారెక్టరైజేషన్ బేస్డ్ చేసినా కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా వుండదని, ఈ చిత్రంలో కుదరడం వల్ల దీనిని ఇంతగా ఆదరిస్తున్నారని సుకుమార్ తన అభిప్రాయం చెప్పగా చరణ్ కూడా అంగీకారం తల ఊపాడు. నిజంగానే మాస్ కథలు చేస్తూ యాక్షన్, కట్ మాత్రమే ఫాలో అవుతూ వచ్చిన చరణ్ తొలిసారిగా నటుడికి పరీక్ష పెట్టే పాత్రని ఎంచుకుని చాలా గొప్పగా దానిని పోషించాడు. ఇంతకాలం అతడిని నటుడిగానే చూడని వారితో కూడా శభాష్ అనిపించేసుకుంటున్నాడు.
Recent Random Post: