చిన్న కారు కూడా కొనుక్కోలేకపోయాడు

ఖయామత్ సే ఖయామత్ తక్.. అమీర్ ఖాన్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. అతడి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ అది. ఈ సినిమా నుంచే అమీర్ దండయాత్ర మొదలైంది. మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్ గా అతడు ఎదగడానికి, బాలీవుడ్ లో రికార్డు వసూళ్లు సృష్టించే సినిమాల్ని చేయడానికి పునాదులు వేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా తనకు ఆర్థికంగా అస్సలు కలిసిరాలేదంటున్నాడు అమీర్.

“ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా హిట్ అయినప్పటికీ నాకేం కలిసిరాలేదు. ఆ సినిమా పెద్ద హిట్ కావొచ్చు, కానీ అప్పటికి కారు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. జనాలు నన్ను గుర్తించి, దాదాపు నన్ను చుట్టుముట్టేసే పరిస్థితి వచ్చేంత వరకు నేను అందర్లానే బస్సులు, ఆటోల్లో తిరిగేవాడిని.”

ఖయాతమ్ సినిమా చేసినందుకు గాను తనకు కేవలం 11వేల రూపాయలు మాత్రమే అందాయని అంటున్నాడు అమీర్ ఖాన్. కాస్త ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖాన్ వెల్లడించాడు. రీసెంట్ గా 30ఏళ్లు పూర్తిచేసుకుంది ఖయామత్ సినిమా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమీర్ ఖాన్, ఈ విషయాన్ని బయటపెట్టాడు.

నిజానికి ఇది అమీర్ మొదటి చిత్రం కాదు. 1984లో వచ్చిన హోలి చిత్రంలో అమీర్ నటించాడు. కానీ అతడికి గుర్తింపు తెచ్చింది మాత్రం 1988లో వచ్చిన ఖయాతమ్ సే ఖయామత్ తక్ సినిమా మాత్రమే. కెరీర్ లో ఎన్నో విజయాలందుకున్నప్పటికీ, సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ సినిమాను గుర్తుచేసుకుంటాడు అమీర్.


Recent Random Post: