
రామ్ చరణ్, బోయపాటి కాంబోలో సినిమా స్టార్ట్ అయింది. మొదటి రెండు షెడ్యూల్స్ కు చరణ్ హాజరుకాలేదు. మూడో షెడ్యూల్ నుంచి సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఓ యాక్షన్ సీన్ తో పాటు కొన్ని కాంబినేషన్ సీన్లు మాత్రమే తీశారు. అవి కూడా ఇప్పుడు మళ్లీ రీషూట్ చేయబోతున్నారు.
అవును.. తను నటించిన కాంబో సీన్లు చరణ్ కు నచ్చలేదట. అందుకే మళ్లీ రీషూట్ పెట్టమని బోయపాటిని కోరాడు. రీసెంట్ గా జరిగిన ఓ షెడ్యూల్ లో రామ్ చరణ్, ప్రశాంత్, స్నేహ, కియరా అద్వాని కాంబినేషన్ లో కొన్ని సీన్లు తీశారు. వీటిలో కొన్నింటిని త్వరలో రీషూట్ చేయబోతున్నారు. ప్రశాంత్, స్నేహ కాల్షీట్లు చూసుకొని ఈ సన్నివేశాలు మళ్లీ ప్లాన్ చేస్తారు.
ఈనెల 12నుంచి బ్యాంకాక్ వెళ్లబోతోంది యూనిట్. అక్కడ 15రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత రీషూట్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వివేక్ ఒబరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనేది ప్లాన్.
Recent Random Post: